సారాంశం
తన ఇంటిపై దాడిని ఒక కులం మరో కులంపై చేసిన దాడిగా అభివర్ణించారు వైసీపీ నేత. మాజీ మంత్రి అంబటి రాంబాబు. సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ప్రశ్నించారు. గతంలో వంగవీటి రంగాను కూడా పోలీసుల సహకారంతోనే చంపారని, ఇప్పుడు తన విషయంలోనూ అదే పునరావృతమవుతోందని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కాపు నేతల కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
5 మార్చి, 2026 02:12 PMకి